Thursday 28 April 2011

SEE LIGHT IN DARKNESS

చీకటిని చీల్చుకుని వచ్చే వెలుగును

అందుకోడానికి ప్రయత్నించు

అది నీకు మార్గం చూపెడుతుంది

మనిషివనే శ్వాస నీలో ఎప్పుడు

అలాలే ఉండనివ్వు లేకుంటే

నీకోసం పశుసంతతి గుంపులుగా

ఎదురుచూస్తుంది

కర్కశం కాటిన్యం లను ఒంటరిని చెయ్యి

తుంటరితనాన్ని దూరం చెయ్యి

వెయ్యి అడుగు సౌధం నీ వెంటే ఉంటుంది

కల్మషం లేని జీవిగా కలిసిపో

నీ పయనం ఎండమావులను

సైతం లెక్కచెయ్యదు

భక్తి ముసుగు లో పాపాలు

నీ మరణసయ్యకు మార్గాలు

అన్వేషించు దొరుకుతుంది

స్వచ్చమైన ప్రేమాప్యాతలు

మండువేసవిలో పండు వెన్నెల

ఎన్త అందంగా ఉంటుందో

గమనం అలా చేసుకో

నీ జీవితం వసంత కోకిలల మారుతుంది

కదిలే కాలం మెదిలే ఆలోచనలు

నిరంతర మస్తిష్క పోరాటాలు

అనునిత్యం నిన్ను వెంటాడే జ్ఞాపకాలు

ప్రతిక్షణం గుర్తుతెచ్చుకో

అవి నిన్ను వెంటాడుతూనే ఉంటాయి

వాటిని చీల్చుకుని ముందుకు వెళ్లేందుకు

ప్రయత్నిచు కాలం నీ వెంటే ఉంటుంది

మంచి మనస్సాక్షి గా

నీతోనే ….నీ వెంటే..

No comments:

Post a Comment